సీట్లు గెలిచిన పార్టీ ఒకటి. పోటీ చేసిన అన్ని సీట్లలో 21కి 21 సీట్లు గెలిచిన పార్టీ ఇంకోటి. థర్టీ పొలిటికల్ ఇయర్సీ లీడరు ఓ నాయకుడు. తన చరిష్మాతో కూటమికి అధికారం దక్కడంలో కీరోల్ ప్లే చేసిన నేత మరొకరు. ఇలా ఎవరి బలం వారికుంది. అయినా ఆ ఇద్దరు లీడర్లు మాత్రం కలసి నడుస్తున్నారు. టీడీపీ, జనసేన లీడర్లు మాత్రం ప్రతీ చిన్నదానికి గొడవ పడుతూ రచ్చకెక్కుతున్నారు. ఒక సెగ్మెంట్‌లో ఇష్యూ మర్చిపోకముందే మరో నియోజకవర్గంలో ఏదో ఒక గొడవ జరుగుతోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా కాకినాడ పంచాయితీ తెరమీదకు వచ్చింది. కాకినాడ సిటీ సంజయ్ నగర్‌లో ఒక వైన్ షాపు కోసం మొదలైన వివాదం పెద్దగవుతోంది. వైన్ షాపు లీజు తాను తీసుకున్నాననంటే అంటే తాను తీసుకున్నానని టీడీపీ కాకినాడ నగర అధ్యక్షుడు మల్లిపూడి.. మరోపక్క ఎంపీ అనుచరుడు దొరబాబు అండగా ఉండి చక్రం తిప్పారు.
ఆ గొడవను మరవక ముందే మరో వివాదం రోడ్డుపైకొచ్చి నిరసన చేసే స్థాయికి దిగింది. దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణాలు ఏర్పాటు విషయంలో మరోసారి ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనుచరుల మధ్య వివాదం బహిర్గతమైంది. టీడీపీ నేతలు సిటీ అధ్యక్షుడు మల్లెపూడి వీరు ఆర్డీవో ఆఫీస్ ఎదుట రోడ్డుపై పడుకుని ఐదు గంటల అలజడి సృష్టించారు. కాకినాడలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానై ఇటు కూటమికి అటు అధినేతలకు తలపోటుగా మారింది. ఇద్దరి నేతల అనుచరులు మాత్రం తమ మాటే నెగ్గాలని పట్టుతో ఉన్నారు.