ఉభయ గోదావరి జిల్లాలో రేపు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక..

vote-4-.jpg

రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. గత ఎన్నికల్లో యూటీఎఫ్‌ తరఫున గెలిచిన షేక్‌ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి అధికారులు ఎన్నికల మెటీరియల్‌ను అందజేస్తున్నారు. ఎన్నికల మెటీరియల్ పంపిణీకి పీవో, ఏపీవో, ఓపీవో, మైక్రో అబ్జర్వర్లు, సెక్టార్ అధికారులు హాజరయ్యారు. ఈ ఉపఎన్నికలో 16,737 మంది టీచర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఆరు జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూలో కౌంటింగ్ చేపట్టనున్నారు.

Share this post

scroll to top