కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. అతిపిన్న వయస్సులో ఎమ్మెల్యేగా నందిత ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. లాస్య నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరికొద్ది సేపట్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ గన్‌పార్క్‌కు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించేందుకు గన్‌పార్క్‌కు చేరుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ తో పాటు రైతు భరోసా,రైతు రుణమాఫీ అంశాలపై సమావేశాల్లో వాడి వేడి చర్చ జరిగే ఛాన్సుంది. కొత్త ఆర్వోఆర్ చట్టం, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులపై కూడా చర్చించనున్నారు.అలాగే ఈసమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశ పెట్టనుంది రేవంత్ సర్కార్.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు..
