తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా..

ktr-16-.jpg

తెలంగాణ తల్లిని అవమానిస్తారా? తెలంగాణ ఆత్మతో ఆటలాడుతారా? తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా? తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఊపిరి తీస్తారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా? తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా? తెలంగాణ అమర జ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా? తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.. తుచ్ఛమైన స్వార్థ రాజకీయాలకు తెర తీస్తారా? నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన ‘తెలంగాణ తల్లి’ విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా.. కాంగ్రెస్‌ను తెలంగాణ క్షమించదు.. జై తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.

Share this post

scroll to top