పహల్గాం ఉగ్రదాడుల అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పాక్ కేంద్రంగా పనిచేస్తున్న పలు తీవ్ర వాద స్థావరాలపై భారత్ మెరుపుదాడులు చేసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. దేశంలోని సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్థాన్ సైన్యం దాడులు చేస్తోంది. దీన్ని భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటికే పలువురు సైనికులతో పాటు సామాన్యులు కూడా మరణించారు. కాగా జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్ మూకలు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందినట్లు సమాచారం అందింది. మృతి చెందిన జవాన్ ను మురళీ నాయక్‌గా గుర్తించారు. మురళీది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా కల్లి తండా అని తెలుస్తోంది. రేపు మురళీనాయక్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
పాకిస్థాన్ మూకలు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం..
