రేషన్ కార్డు లబ్దిదారులకు బిగ్ అప్డేట్..

ravanth-reddy-03.jpg

తెలంగాణలో పేదల ఇంట మే నెల రేషన్ పండుగను తీసుకొచ్చింది. కొత్తగా 11 లక్షల మందికి పైగా రేషన్ లబ్ధిదారులుగా గుర్తింపు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు రేషన్ పొందే వారి సంఖ్య 2.93 కోట్లకు చేరుకుంది. ఈసారి ప్రభుత్వం పరిశీలన చేసి అర్హులైన వారికి కొత్త కార్డులు జారీ చేసింది. తాజా గణాంకాల ప్రకారం 31,084 కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వీటి ద్వారా 93,584 మంది సభ్యులు లబ్ధిదారులుగా గుర్తింపు పొందారు. పాత కార్డుల్లో అదనంగా 10,12,199 మంది పేర్లు చేరాయి. ఈ మేరకు అధికారుల ద్వారా కార్డుల జారీ, సభ్యుల చేర్పు ప్రక్రియ పూర్తయింది.

Share this post

scroll to top