పర్యావరణాన్ని కాపాడే భాగంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలక్ట్రికల్ కార్లు, ద్విచక్ర వాహనాలు రోడ్డు ఎక్కాయి. ఇప్పుడు బస్సుల వంతు వచ్చింది. ఇందులోనే భాగంగా కరీంనగర్ బస్ డిపోకు కు డెబ్భై ఎలక్ట్రికల్ బస్సులు కేటాయించబడ్డాయి. ఇవి ఒకసారి చార్జింగ్ పెడితే 350 నుండి 400 కిలోమీటర్లు అవలీలగా ప్రయాణం చేయవచ్చు. ఇందులో తొలి విడతగా 33 సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ 33 బస్సులు కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్ల ప్రాతిపదికన జెసిసి గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టుచే నడపబడుతాయి. ఈ బస్సులో రెండు సీసీ కెమెరాలతో పాటు. ఫైర్ ఎక్జిస్టర్ అలాగే పూర్తిగా ఇవి పవర్ విండోతో నడుస్తుంది. పూర్తిగా ఎలక్ట్రికల్ తో నడిచే వాహనం ఇది. ప్రస్తుతం వీటికి సంబంధించిన అవసరమైన మౌలిక వసతులు ఏర్పాట్లు భాగంగా ఎలక్ట్రికల్ పనులు కొనసాగుతున్నాయి. మౌలిక వసతులు ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత త్వరలోనే ఈ లగ్జరీ బస్సులు రోడ్డు ఎక్కనున్నాయి.
ఆర్‌టీసీ ప్రయాణికులకు అదిరే శుభవార్త..
