ఆసరా పెన్షన్లు డబ్బులే ఈ నెల కూడా..

penshion-26.jpg

తెలంగాణ పగ్గాలను చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ  పెన్షన్ దారులకు షాక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే సాధారణ పెన్షన్ ను రూ. 4,000, దివ్యాంగ పెన్షన్ ను రూ. 6,000 చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాజాగా రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పెన్షన్లు డబ్బులే ఈ నెల కూడా ఇవ్వనున్నట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో లబ్దిదారుల ఖాతాల్లో సొమ్ములు జమ చేయనుంది సర్కార్. ప్రస్తుతం సాధారణ పింఛను రూ. 2,016, దివ్యాంగ పింఛను రూ. 4,016 ఇవ్వనుంది ప్రభుత్వం. గత బడ్జెట్లో ఆసరాకు రూ.12వేల కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.14,861 కోట్లు కేటాయించారు. అయితే పింఛన్లు రూ.4వేలకు పెంచాలంటే ఇవి సరిపోవని తెలుస్తోంది.

Share this post

scroll to top