ఓవర్సీస్‌లో చరిత్ర సృష్టించిన ది గోట్..

gote-11.jpg

వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ డివైడ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ఈ చిత్రం కేరళ, తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నప్పటికి తమిళనాడు, ఓవర్సీస్, కన్నడ మార్కెట్‌లో దుమ్మురేపే కలెక్షన్లను నమోదు చేస్తున్నది. విజయ్ నటించిన ఈ సినిమా గత 5 రోజుల్లో 150 కోట్లకుపైగా నికర వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రం 6వ రోజున తమిళంలో భారీ వసూళ్లు రాబట్టింది. అయితే దక్షిణాదిలో మిగితా రాష్ట్రాల్లో అంతగా ప్రభావం చూపలేకపోయింది. తమిళంలో 10 కోట్ల రూపాయలు, తెలుగులో 70 లక్షలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో కలిపి 2 కోట్ల రూపాయలు, కన్నడలో 2.5 కోట్ల రూపాయలు, కేరళలో 50 లక్షలు వసూలు చేసింది. 16 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 162 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

తాజాగా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మూవీకి సంబందించిన కలెక్షన్స్ బయటకు వచ్చాయి. నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 288 కోట్లను కలెక్ట్ చేసింది. చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా అధికారికంగా వెల్లడించింది. నాలుగు అంటే నాలుగు రోజుల్లో రూ. 288 కోట్లు జస్ట్ విజయ్ తలపతి థింగ్స్ అంటూ కొత్త పోస్టర్ షేర్ చేశారు. వీకెండ్ రావడంతో సూపర్ బిజినెస్ చేయడంతో వసూళ్లు బాగా పెరిగాయి.

Share this post

scroll to top