ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ ప్రభుత్వ మద్యం షాపులకు గుడ్ బై చెప్పేసింది కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. కొత్త మద్యం పాలసీ వచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులు మద్యం షాపులు ఏర్పాటు చేశారు. అయితే, లిక్కర్ అమ్మకాలు పెంచుకునే విధంగా ఆఫర్లతో మందు బాబులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో మందు ప్రియులకు కిక్కు ఇచ్చే దివాళి బోనంజ ఆఫర్ ప్రకటించారు బార్లు. వైన్స్ షాప్ యజమానులు మద్యం బాటిల్ కొనండి సర్వం మేమే సమకూరుస్తాం అంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. మద్యం బాటిల్ కొనుక్కుంటే ఒక గుడ్డు, ఈ లిక్కర్ బాటిల్ కొంటే ఓ గ్లాసు, వాటర్ ప్యాకెట్ ఉచితమని ఆఫర్ ప్రకటించినట్లు బ్యానర్ వేయడంతో చూసే వాళ్లు ఆసక్తికగా గమనిస్తున్నారు. ప్రజలు ఇది ఎక్కడ విడ్డూరమని నోరెళ్లబెట్టారు. మందుబాబులకు దీపావళి పండుగ ఒకరోజు ముందుగానే వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తంగా లిక్కర్ అమ్మకాలు పెంచుకోవడానికి మందు బాబులను ఆకర్షించడానికి బార్లు, వైన్ షాపుల యజమానులు కొత్త ప్లాన్ వేశారు.
మందు బాబులకు గుడ్ న్యూస్..
