పవన్, ప్రభాస్‌‌ సినిమాల్లో నిధి అగర్వాల్..

nidhi-30.jpg

హైదరాబాద్ నగరంలో పుట్టిన నిధి అగర్వాల్ తన చదువు మొత్తం ఇక్కడే పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఈమె ఫ్యామిలీ కర్నాటకకు వలస వెళ్లింది. అక్కడ మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే ఎన్నో బ్రాండ్ల కోసం పని చేసింది. ఆ తర్వాత అంటే 2017లో ‘మున్నా మైఖేల్’ అనే హిందీ సినిమాతో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేసింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే నిధి అగర్వాల్ ‘సవ్యసాచి’ అనే మూవీతో టాలీవుడ్‌ లోకి వచ్చింది. కానీ, ఇది ఆమెకు మంచి ఆరంభాన్ని అందించలేదు. ఆ తర్వాత అఖిల్‌ తో ‘మిస్టర్ మజ్నూ’ సినిమాలోనూ నటించినా నిరాశే ఎదురైంది. కానీ, ‘ఇస్మార్ట్ శంకర్’తో ఫస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. కానీ, ఆ తర్వాత నటించిన ‘హీరో’ మూవీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. నిధి అగర్వాల్‌కు హిట్లు పెద్దగా రాకున్నా ఆఫర్లు మాత్రం భారీ స్థాయిలోనే లభిస్తున్నాయి. ఈ అమ్మడు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’లో నటిస్తోంది. అలాగే, ప్రభాస్ – మారుతి ‘ది రాజా సాబ్’ మూవీలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. వీటితో పాటు వెబ్ సిరీస్‌లు, ప్రారంభోత్సవాలు, స్పెషల్ ఈవెంట్లతో నిధి అగర్వాల్ యమా బిజీగానే గడుపుతోంది.

Share this post

scroll to top