రేపు తిరుమలకి వెళ్లనున్న జగన్..

ys-jagan-26.jpg

లడ్డూ వివాదం దుమారం రేపుతున్న సమయంలో ఎపి మాజీ సిఎం జగన్ కాలి నడకన తిరుమలకు వెళ్లి శ్రీవెంకటేశ్వ రస్వామిని దర్శంచుకోనున్నారు. ఈనెల 27, శుక్రవారం రాత్రికి ఆయన తిరుమల చేరుకుంటున్నారు. మరుసటి రోజు సెప్టెంబరు 28, శనివారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబుగారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారంరోజున పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిస్తోంది.

Share this post

scroll to top