పేరుకు ఆయన ఎమ్మెల్యే అది కూడా తొలిసారిగా ఎన్నికయ్యారు. అలాంటప్పుడు ఎలా ఉండాలి ప్రజలకు అండగా ఉండి సమస్యలు పరిష్కరించాల్సిందిపోయి తానే ఆ నియోజకవర్గ ప్రజలకు సమస్యగా మారాడు. రోజులు మారాయన్న సంగతి మరిచారు. చివరికి ఆ సొంత నియోజకవర్గ ప్రజలే రోడ్డెక్కి ఆ ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా నినదించాల్సిన పరిస్థితి నెలకొంది. చంద్రబాబునాయుడు పిలిచి టికెట్ ఇస్తే చివరాకరకు ఆయన చేసిన ఘనకార్యమేంటంటే మహిళలపై లైంగిక వేధింపులు. సమస్యను చెప్పుకుందామని వెళ్లిన మహిళలకు ఈయనగారి నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతుండటంతో వారు మింగలేక కక్కలేక చాలా ఆవేదనకు గురయ్యారు. ఇక ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దు మీరి ప్రవర్తిస్తుండటంతో కొలికపూడికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు ఆ నియోజకవర్గ ప్రజలు, సొంత పార్టీ కార్యకర్తలు.
అసలు విషయానికొస్తే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీను ఆగడాలు నియోజకవర్గంలో మితిమీరిపోయాయి. అధికారం చేతిలో ఉందికదా అని రెచ్చిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పేకాట శిబిరాల ఏర్పాటులో అయ్యగారు ఎక్కువ వాటా డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ ఇవ్వకుంటే భాగస్వామిపై కేసుల అస్త్రం ప్రయోగిస్తున్నారట. ఈ మధ్యే తుమ్మలపల్లి శ్రీనివాసరావు అలియాస్ చిట్టేల శీను అనే సర్పంచ్‌తో బేరం కుదరక కొలికపూడి పగబట్టారని ఆయన భార్య ఆవేదన చెంది ఆత్మహత్యకు యత్నించారు. అలానే ఎ.కొండూరుకు చెందిన దాడి రామారావు కొలికపూడి ఎన్నికల కోసం రూ.కోటి ఇచ్చారని సమాచారం. ఎమ్మెల్యే అయ్యాక కొలికపూడి రూ.20లక్షలు మాత్రమే ఇచ్చి దిక్కున్న చోటు చెప్పుకోమని అన్నారట. అంతేగాదు ఎమ్మెల్యే కుటుంబం సింగపూర్ పర్యటనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు దాడి రామారావు కుటుంబ సభ్యులు చేస్తే.. అసలు రామారావు ఎవరో తెలియదని ఫోను పెట్టేసినట్లు టీడీపీ వర్గాలు నియోజకవర్గంలో గుసగుసలాడుతున్నాయి.