వాహనదారులపై టోల్‌ భారం..

tool-plaza-19.jpg

విజయవాడ, గుంటూరు మధ్య జాతీయ రహదారిపై కాజ వద్ద ఉన్న టోల్‌ప్లాజాలో వాహనదారులు ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే అన్నిసార్లూ టోల్‌ మోత మోగుతోంది. కాజ వద్ద మాత్రమే కాదు రాష్ట్రంలోని 65 టోల్‌ ప్లాజాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. టోల్‌ప్లాజాల బీవోటీ గడువు ముగియడంతో గత అక్టోబరు నుంచి కొత్త నిబంధన ప్రకారం టోల్‌ ఫీ వసూళ్లు జరుగుతున్నాయి. దాంతో వాహనదారులపై తీవ్రంగా భారం పడుతోంది.

గత సెప్టెంబరు వరకు ఒకసారి వెళితే రూ.160, తిరుగు ప్రయాణంలో రూ.80 చెల్లిస్తే సరిపోయేది. 24 గంటల వ్యవధిలో మళ్లీ ఎన్నిసార్లు తిరిగినా టోల్‌ వసూళ్లు ఉండేవి కావు. అక్టోబరు నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లూ ఒకవైపు పూర్తి ఫీజు, రెండోసారి సగం చొప్పున వసూలు చేస్తున్నారు. దాంతో పని నిమ్మిత్తం ప్రయాణించే వారిపై పెను భారం పడుతోంది. విజయవాడ-గుంటూరు మధ్య నిత్యం వందలాది మంది వాహనాల్లో ప్రయాణిస్తుంటారు. అందరిపై టోల్‌ ఫీజు రూపంలో తీవ్ర భారం పడుతోంది.

Share this post

scroll to top