మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిటిషన్లపై విచారణ వాయిదా

klejriwallllllllll.jpg

ఢిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. అనంతరం విచారణను జూన్ 1వ తేదీకి వాయిదా వేసింది. జూన్ 1 మధ్యాహ్నం రెండు గంటలకు కేజ్రీవాల్ సాధారణ, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై కోర్టు విచారణ జరపనుంది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని ఈడీ తరఫు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అన్నారు.

Share this post

scroll to top