తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం తాజాగా మరో రెండు పథకాలను అమల్లోకి తెచ్చింది. మహిళా శక్తి పేరుతో మహిళలకు బ్యాంకుల ద్వారా ప్రత్యేక రుణాలను అందిస్తోంది. వీటితో పాటు మరో రెండు బీమా పథకాలను అమలు చేస్తోంది. ఉచితంగానే రుణబీమాతో పాటు ప్రమాద బీమాను కల్పిస్తోంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోని రుణం తీసుకున్న మహిళా సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే రుణమాఫీతో పాటు ప్రమాద బీమా ద్వారా ఆర్థికసాయం అందనుంది. రుణబీమా పథకాన్ని మార్చిలోనే ప్రభుత్వం ప్రకటించగా తాజాగా ప్రమాద బీమా పథకానికి సంబంధించి ఉత్వర్వులను ప్రభుత్వం ఇటీవల గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులకు జారీ చేసింది.
మహిళా శక్తికి రూ.10 లక్షలు..
