బీహార్ ప్రభుత్వం గట్టిగా నిలదీసింది కాబట్టి ఆ ప్రభుత్వానికి ఎక్కువ నిధులు..

ap-23-.jpg

అమరావతి నిర్మాణానికి దాదాపు లక్ష కోట్లకు పైగా అవసరం అవుతాయనే అంచనా ఉంది. అలాగే పోలవరం, రోడ్లు, భారీ పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన, పథకాల అమలు ఇలా చాలా అంశాలకు లక్షల కోట్ల రూపాయలు కావాలి. అటు సీఎం చంద్రబాబు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికే సిద్ధపడట్లేదు. ఖజానాలో మనీ లేదనీ, 2 నెలల తర్వాతే బడ్జె్ట్ సంగతి చూస్తామని అంటున్నారు. మరి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చెయ్యాలి కదా? విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాతోపాటూ అన్నీ రాబట్టేలా గట్టిగా ప్రయత్నించాలి కదా? అలా ఎందుకు చెయ్యట్లేదు అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ప్రస్తుతం కూటమి పార్టీలపై ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఉంది. అది అందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు రాబట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించాలి. కానీ అలాంటి గట్టి ప్రయత్నం జరగలేదనీ, అందుకే కేంద్రం పైపై నిధులతో సరిపెడుతోందనే వాదన ఉంది. బీహార్ ప్రభుత్వం గట్టిగా నిలదీసింది కాబట్టి ఆ ప్రభుత్వానికి ఎక్కువ నిధులు కేటాయించారనే టాక్ వస్తోంది. ఇక ఈ ప్రకటించిన నిధుల్లో నిజంగా ఎంతవరకూ ఇస్తారనేది మరో అంశం. ఎందుకంటే బడ్జె్ట్‌లలో చెప్పినవి కొన్నిసార్లు అమలు చెయ్యరు. అవి కాగితాలకే పరిమితం అవుతాయి. అందువల్ల ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా డైనమిక్ అవ్వాలనీ, కేంద్రం మెడలు వంచి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది.

Share this post

scroll to top