ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతాయో కనీసం తెలియకపోతే ఎలా..

pemasani-29.jpg

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకముందు వైయస్ జగన్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కింద ఏడాదికి రూ.4100 కోట్లు ఖర్చుచేశారు. ఇందులో కేంద్రం ఇచ్చే రూ.350 కోట్లు పెమ్మసాని గారూ కనీస అవగాహన లేకుండా కేంద్ర మంత్రి హోదాలో ఇలాంటి ప్రకటనలు ఎలా చేస్తారు? కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతాయో కనీసం తెలియకపోతే ఎలా? కేంద్ర ప్రభుత్వ పథకమైనా అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఈమేరకైనా పరిజ్ఞానం పెంచుకోకపోతే ఎలా? ఆరోగ్యశ్రీ కార్డు తరహాలోనే ఆయుష్మాన్ భారత్‌ను వినియోగించుకోవచ్చని పెమ్మసాని వివరించారు. ఏపీలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడానికి అవసరమైనన్ని డబ్బులు లేవని ఆయన తేల్చి చెప్పారు. ఆయుష్మాన్‌ భారత్‌ అనేది ఆరోగ్యశ్రీలో అంతర్భాగం. కానీ కేంద్రం ఇచ్చేది కొంతే. ఏడాదికి రూ.350 కోట్లకు మించి ఆయుష్మాన్‌ భారత్‌ కింద నిధులను కేంద్రం ఇవ్వడం లేదు. ఆయుష్మాన్‌ భారత్‌ కింద గరిష్ట పరిమితి రూ.5 లక్షలు. కానీ.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పరిమితిని రూ.25 లక్షలకి వైయస్‌ జగన్ గారి ప్రభుత్వం పెంచింది. మీ ప్రకటన సారాంశం ఏంటంటే.. ఆరోగ్యశ్రీని ఎత్తివేసి కేవలం ఆయుష్మాన్‌ భారత్‌తో సరిపెడుతున్నారన్నమాట అంతేగా? ఓవరాల్‌గా పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడే పథకాన్ని గంగలో కలిపేస్తున్నారన్నమాట.

Share this post