ఏపీ, తెలంగాణలో మరో కొత్త బ్యాంక్ వచ్చేస్తోంది..

bank-31.jpg

ఏపీ, తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఏంటని అనుకుంటున్నారా.. మరో కొత్త బ్యాంక్ తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అంటే తెలుగు ప్రజలకు కొత్త బ్యాంక్ సేవలు అందించబోతోంది. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ తెలుగు రాష్ట్రాల్లోకి అడుగు పెట్టబోతోంది. ఇది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్. ఈ బ్యాంక్ తాజాగా కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఐదు కొత్త బ్రాంచులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 2024 చివరి నాటికి బ్యాంక్ కొత్తగా బ్రాంచులు ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌లో మూడు కొత్త శాఖలను ఏర్పాటు చేస్తామని యూనిటీ బ్యాంక్ ప్రకటించింది. విశాఖపట్నంలో ఒకటి, విజవాడలో మరొకటి చొప్పున బ్యాంక్ బ్రాంచులు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. అంతేకాకుండా బ్యాంక్ సేవలను మరింత పటిష్టం చేయడానికి రూ. 2 వేల కోట్లు సమీరిస్తామని యూనిటీ బ్యాంక్ పేర్కొంది. వివిధ పట్టణాల్లో బ్యాంక్ బ్రాంచుల ఏర్పాటు కోసం వచ్చే 18 నెలల కాలంలో బ్రాంచుల సంఖ్యను 182 నుంచి 225కు పెంచుకుంటామని తెలిపింది.

Share this post

scroll to top