గద్దర్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..

vishnu-28.jpg

ప్రజాయుద్ధనౌక గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే నక్సలైట్లతో కలిసి ఎంతో మందిని గద్దర్‌ హత్య చేయించారు. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే కాగా ఇప్పుడు గద్దర్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎల్‌టీటీ ప్రభాకరన్, నయీమ్‌తో గద్దర్‌ను పోల్చారు విష్ణువర్ధన్ రెడ్డి. గద్దర్ కి పద్మ పురస్కారం ఇవ్వాలని ప్రధానికి సీఎం లేఖరాయడంపై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి. భారత రాజ్యాంగాన్ని విశ్వసించని వ్యక్తి గద్దర్ కి పద్మ పురస్కారం ఎలా ఇస్తారు? అని నిలదీశారు.

Share this post

scroll to top