విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని నీరుగార్చేలా సీఎం చంద్రబాబు మాట్లాడ్డం వెనుక పెద్ద కుట్ర ఉందని వైయస్ఆర్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్‌ఖాతాలో ట్వీట్ చేశారు. స్టీల్‌ప్లాంట్ అమ్మకానికి మద్దతుగా చంద్రబాబు చేసిన ప్రకటనగానే దీన్ని చూడాలి. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబు ఇలాగే మాట్లాడి, కోలుకోలేని దెబ్బతీశారు. ఇప్పుడు స్టీల్‌ప్లాంట్ విషయంలోనూ అంతే. బాబు వచ్చాడు.. అందర్నీ ముంచుతున్నాడు. అంటూ అమర్నాథ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
చంద్రబాబు మాటల వెనుక పెద్ద కుట్ర..
