వైఎస్ షర్మిల చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు..

ys-sharmila-14-.jpg

ఏపీలో ఇటీవల సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. స్వర్ణాంధ్ర విజన్-2047 పేరుతో సీఎం చంద్రబాబు మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ దశ, దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్‌లు కాదు. విభజన హామీలు, రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలు, దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేశారు. పూర్తిగా అటకెక్కించారు అని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో UPA సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. నూతన రాజధానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ఇవ్వాలని సూచించింది.

Share this post

scroll to top