వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్. షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. కేవలం 1.7శాతం ఓట్లు సాధించిన, రాష్ట్రంలో అస్థిత్వం లేని కాంగ్రెస్ గూర్చి, షర్మిల గూర్చి మాట్లాడటం అనవసరమంటూ జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యా్ఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఓట్ల విషయం పక్కన పెడితే జగన్ కు 38శాతం ఓట్లు వేసిన ప్రజలకు తను అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదో చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. మాకు ఓట్లు సీట్లు రాలేదు కాబట్టి మేం అసెంబ్లీకి వెళ్లడం లేదని, మీకు 11సీట్లు గెలిపించినా, 38శాతం ఓట్లు వేసినా మీరెందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదని, మీకు మాకు తేడా ఏంటని షర్మిల ప్రశ్నించారు.