కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖ జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఒక్కొక్కరు 20 లక్షలు ఇవ్వాల్సిందే అంటూ ఎమ్మెల్యేలు రేటు ఫిక్స్ చేశారు. 10 స్థానాలకు గాను ఒక్కో ఎమ్మెల్యేకి రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో మా గెలుపునకు ఏమైనా సహకరించారా అంటూ నిలదీస్తున్నారు. వేలంపాట సంస్కృతి వద్దు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఇప్పుడు వేలం పాట పెట్టి డబ్బులు అడగడం సిగ్గుచేటని సాక్ష్యాత్తు టీడీపీ కార్పొరేటర్లే అంటున్నారు. దీంతో సొంత పార్టీ నుంచే టీడీపీ ఎమ్మెల్యేలకు సెగ తగులుతోంది.
పోటీ చేయాలంటే రూ.20 లక్షలు ఇవ్వాల్సిందే..
