నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం..

acham-naidu-29.jpg

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్‌న్యూస్ చెప్పారు. భారీ వర్షాలు, గోదావరి వరదలకు పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వకుండా రూ.1,680 కోట్లు బకాయిలు ఉంచిందని మంత్రి తెలిపారు. వారం రోజుల్లో ధాన్యం బకాయిలు రూ.680 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తెలిపారు. ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్‌లు తూర్పుగోదావరి, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించారు. అలాగే వరద ముంపునకు గురైన వరి చేలు, దెబ్బతిన్న ఏటిగట్లను పరామర్శించారు. ప్రతి ఏటా వచ్చే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపుతామన్నారు.

Share this post

scroll to top