దావోస్ లో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు..

davos-20.jpg

వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వెళ్లిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బృందం జ్యూరిచ్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా అదే ఎయిర్ పోర్టుకు చంద్రబాబు టీమ్ చేరుకుంది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మంత్రులు శ్రీధర్ బాబు, లోకేశ్, రామ్మోహన్ నాయుడు, శ్రీధర్ ఒకే చోట కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Share this post

scroll to top