ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత పోతిన మహేశ్ విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు చాదస్తం ఎక్కువైందని అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అందుకే వరదొచ్చినా, బురదొచ్చినా, ఆఖరికి ప్రపంచం మీద కరోనా మహమ్మారి వచ్చినా కారణం వైఎస్ జగనే అని మాట్లాడుతున్నారని విమర్శించారు. కురుస్తున్న వర్షాలు తెలుసు కట్టెలు తెంచుకుంటున్న కృష్ణా నది తెలుసు అయినా సరే విజయవాడ మునిగేవరకు అసలు ఏ ఏ వాగులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ ప్రభుత్వానికి తెలియలేదని పోతిన మహేశ్ విమర్శించారు. వరదకు ముందు చేయాల్సిన పనులు చేయక, ముంపు ముంచుకొచ్చాక, ప్రజలు నీట మునిగాక చిర్రెత్తిన ప్రజలను శాంతి పరచడానికి ఆయన రోడ్ల మీద బోటుల్లో తిరుగుతున్నారని అన్నారు. అసలు ఆ బోట్లు రోడ్ల మీదకు రాకుండా ఆపలేకపోయినా తన చేతకానితనాన్ని తెలివిగా కప్పిపుచ్చుకుందామని అనుకున్నారని కూటమి పార్టీలపై మండిపడ్డారు.
వరదొచ్చినా బురదొచ్చినా ఆఖరికి కరోనా మహమ్మారి వచ్చినా కారణం జగనే..
