గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్నారై వ్యవహరించిన తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నారై లోకేష్‌పై కేసు నమోదు చేసిన కొద్ది సేపటికే పోలీసులు విడుదల చేశారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు. సీఎం జగన్ విదేశీ పర్యటనలో భాగంగా మే 17న గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించాడు ఒక ఎన్నారై. అతనిపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు వైఎస్ఆర్సీపీ ముఖ్యనేతలు. ఎన్నారై డాక్టర్ లోకేష్ అరెస్ట్ వ్యవహారంలో వైసీపీ నేతలు సీరియస్‌గా ఉన్నారు. ఎన్నారైను అరెస్ట్ చేసినట్లు చేసి గంటల వ్యవధిలోనే విడిచిపెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు.
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసుల తీరుపై వైసీపీ నేతల ఆగ్రహం..
