కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేస్తున్న వైసీపీ నేతలు

Sajjala.jpg

ఆంధ్రప్రదేశ్ లో మే 13న లోక్ సభ 25 స్థానాలు, అసెంబ్లీ 175 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జూన్ 04న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కూటమి నేతలు తామే అధికారంలోకి వస్తామని చెబుతుండగా.. మరోవైపు అధికార వైసీపీ నేతలు కూడా ఏపీలో మరోసారి తామే అధికారంలో ఉంటామని.. ప్రజలు జగన్ వైపే ఉన్నారని చెబుతున్నారు.

ఈ తరుణంలోనే కౌంటింగ్ ఏజెంట్లకు వైసీపీ కీలక నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్ల సమావేశానికి హాజరయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

Share this post

scroll to top