మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే శరత్ టాకీస్‌ను యాజమాన్యం స్వాధీనం చేసుకుందని అన్నారు. శరత్ టాకీస్ యాజమాన్యంలో ఒకరైన మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు టీ పార్టీకి ఎమ్మెల్యే రాము, టీడీపీ నేతలు హాజరయ్యారు. థియేటర్లో వైసీపీ ఫ్లెక్సీలు.. కొడాలి నాని ఫోటోలను థియేటర్ యజమాన్యం తొలగించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. తమకు జరిగిన అన్యాయంపై థియేటర్ హక్కుదారులు తనను కలిశారన్నారు. గుడివాడ నడిబొడ్డులో ఇన్నాళ్లు అరాచకానికి అడ్డాగా వైసీపీ కార్యాలయం నిలిచిందన్నారు.
గుడివాడలోని వైసీపీ కార్యాలయం ఖాళీ..
