వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి లండన్ పర్యటనకు వెళ్లిన విషయం విదితమే ఈ నెల 14వ తేదీన లండన్ వెళ్లిన వైఎస్ జగన్ దంపతులు ఇవాళ ఉదయం 10 గంటలకు లండన్ నుంచి బెంగుళూరుకు చేరుకున్నారు. దాదాపు 15 రోజులకు పైగా జగన్ లండన్ లోనే ఉన్నారు. తన కుమార్తె వర్షా రెడ్డి డిగ్రీ ప్రధానోత్సవ కార్యక్రమానికి లండన్ వెళ్లిన జగన్. ఇవాళ బెంగుళూరుకు తిరిగి వచ్చారు. బెంగుళూరు కి చేరుకున్న జగన్ కు వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం పలికారు. ఇక, ప్రస్తుతం బెంగళూరులోనే బసచేయనున్న వైఎస్ జగన్ ఫిబ్రవరి 3వ తేదీ తాడేపల్లిలోని ఆయన నివాసానికి వచ్చే అవకాశం ఉంది. అనంతరం పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించనున్నారట వైఎస్ జగన్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు పార్టీ నేతలపై కేసులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.