బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమాని కొక్కిలగడ్డ ఉషాద్రి టీడీపీ వర్గీయుడే. చంద్రబాబు, లోకేశ్, దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. ఉషాద్రి వారితో కలసి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2014–19 మధ్య టీడీపీ హయాంలోనే ఉషాద్రి బోట్లకు లైసెన్స్‌లు మంజూరయ్యాయి. ఆయన బోట్లకు మారిటైమ్ బోర్డ్ అనుమతులతోపాటు అమరావతి బోటింగ్ క్లబ్‌లో సభ్యత్వం కూడా ఇచ్చారు. దాంతో కృష్ణా నదిలో ఇసుక తవ్వి విక్రయించేవారు.
ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తరువాత నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో ఉషాద్రి బోట్లు కూడా ఉన్నాయి. ఆ బోట్లకు టీడీపీ జెండాలు కట్టి పార్టీ నేతలు వాటిపై కృష్ణా నదిలో విహరిస్తూ బాణసంచా కాల్చారు. ఆ ఫొటోలు, వీడియోలు తాజాగా వైరలయ్యాయి. టీడీపీలో అత్యంత క్రియాశీల సభ్యుడైన ఉషాద్రి బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొంటే అందుకు ఆ పారీ్టనే బాధ్యత వహించాలి కదా? వైయస్ఆర్‌సీపీపై రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నట్లు పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.