వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించారు. ఇటీవల గుర్లలో డయేరియా ప్రబలి పదుల సంఖ్యలో ప్రజలు మృత్యుఒడికి చేరుకున్నారు. సెప్టెంబర్ నెల నుంచే డయేరియా గుర్లలో మృత్యు ఘంటికలు మోగించింది. మొత్తం 14 మంది వ్యాధితో మరణించగా ఇప్పటికీ కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గుర్లకు చేరుకున్న జగన్ ను చూసేందుకు భారీసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. డయేరియా ప్రబలి మరణించినవారి కుటుంబ సభ్యులను జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలతో మాట్లాడిన ఆయన ధైర్యంగా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
బాధితుల్ని పరామర్శించిన జగన్..
