జాకీర్‌ హుస్సేన్‌ మృతి పట్ల వైయ‌స్‌ జగన్‌ దిగ్భ్రాంతి..

ys-j-16-.jpg

ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్ మృతిపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేర‌కు వైయ‌స్ జగన్ త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ మరణించటం బాధ కలిగించింది. సంగీత విద్వాంసుడు అయిన జాకీర్ హుస్సేన్ భారతీయ శాస్త్రీయ సంగీతంలో చెరగని ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. జాకీర్ హుస్సేన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 

Share this post

scroll to top