ఎవ్వరినీ వదలం ఎక్కడున్నా కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి అని సూచించారు వైఎస్ జగన్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన వైఎస్ జగన్. ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ బాధలు చూస్తున్నాను. హామీ ఇస్తున్నాను. కేవలం వైసీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను. అందుకే జగన్ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. వారికి పూర్తి న్యాయం చేస్తాను ఎవ్వరినీ వదలం ఎక్కడున్నా కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదామని హెచ్చరించారు.
కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నవారి పేర్లు రాసుకోండి..
