మనం ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది..

ysj-5.jpg

కూట‌మి ప్ర‌భుత్వం ఆరు నెల‌ల కాలంలోనే ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌ను మూట‌క‌ట్టుకుంద‌ని, మనం ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు పిలుపునిచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా  చెందిన పార్టీ  స్థానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో మాజీముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కుల‌కు ప‌లు అంశాల‌పై వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు.

 టీడీపీ వాళ్లు ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తామని అబద్దాలు చెబుతున్నారని చాలా మంది నాతో కూడా చెప్పారు.  కానీ మనం అలా చేయలేదు. ఇవాల్టికి నా దగ్గరకు వచ్చిన మన ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జీలు మీ దగ్గర అతి మంచితనం, అతి నిజాయితీ ఈ రెండూ మనకు సమస్యలు అంటున్నారు. కానీ రేపు మరలా మనం ఈ గుణాలతోనే అధికారంలోకి వస్తాం. ఆరునెలల కూటమి పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ ఇంటికి గర్వంగా వెళ్లలేని పరిస్థితి. ఏ ఇంటికి వెళ్లినా చిన్నపిల్లలు నా రూ.15వేలు ఏమైందని రైతులు నా రూ.20వేలు ఏమైందని ఉద్యోగం కోసం వెతికే పిల్లలు నా రూ.36వేలు ఏమయ్యాయని అడిగే పరిస్థితి ఉంది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేటతెల్లం అవుతున్నాయి.

Share this post

scroll to top