గత కొన్ని రోజులుగా సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంపై విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీ ఎటుపోతోందని ప్రశ్నించారు. రాష్ట్ర పయణం పురోగతివైపా లేక రివర్స్ నా అంటూ ప్రశ్నించారు. వైసీపీ హయాం ముగిసే సరికి ప్రభుత్వ అప్పు రూ.5.18 లక్షల కోట్లు. చంద్రబాబు హయాం ముగిసే సరికి రూ. 2.71 లక్షల కోట్ల అప్పు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పు రూ.7.48 లక్షల కోట్లు,రూ. 14 లక్షల కోట్లు అప్పని ప్రచారం చేయడం ధర్మమేనా గవర్నర్ తో రూ.10 లక్షల కోట్లు అప్పని చెప్పించడం కరక్టేనా? కేంద్ర ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంది. అని జగన్ అన్నారు.
శ్వేతపత్రాలపై జగన్ కౌంటర్..
