కర్నూల్ జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న వైయస్ జగన్ గారికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం. మహానంది మండలం సీతారామపురం గ్రామంలో టీడీపీ గుండాల చేతిలో హత్యకి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబాన్ని ఇంటికి వెళ్లి పరామర్శించనున్న వైయస్ జగన్. ఆ తర్వాత ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని బెంగళూరుకు వెళ్లనున్నారు. అయితే, వైఎస్ జగన్ ఎందుకు బెంగళూరు వెళ్తున్నారనే దానిపై ఎలాంటి సమాచారం ఇప్పటి వరకు లేదు. అయితే, మూడు నాలుగు రోజుల పాటు అక్కడే బస చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా అధికారం కోల్పోయిన తర్వాత జగన్ పదే పదే బెంగళూరు వెళ్లడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రెండు సార్లు బెంగళూరు వెళ్లి వచ్చారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో కొందర్నిని బెంగళూరులో క్యాంపునకు జగన్ తరలించిన విషయం తెలిసిందే.
కర్నూల్ జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న వైయస్ జగన్..
