రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైసీపీ చీఫ్ జగన్ దుయ్యబట్టారు. తమ పార్టీని అణగదొక్కేందుకు దారుణాలకు పాల్పడుతున్నారని Xలో విమర్శించారు. వినుకొండలో నడిరోడ్డుపై హత్య జరగటం ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. ఈ ఘటనపై వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. కొత్త ప్రభుత్వంలో ఏపీ హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలకు చిరునామాగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులపై PM మోదీ, హోంమంత్రి అమిత్ షా దృష్టి పెట్టాలని కోరారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30 కి తాడేపల్లి కి చేరుకోనున్న
మాజీ సీఎం వై.ఎస్.జగన్. నిన్నటి రోజున వినుకొండలో జరిగిన హత్యాకాండ కారణంగా బెంగళూరు నుంచి అర్ద్యంతరంగా తాడేపల్లి కి చేరుకోకున్న మాజీ ముఖ్యమంత్రి.
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..స్పందించిన జగన్
