ఏపీ మాజీ సీఎం కాన్వాయ్ ను పోలీసులు ఆపారు. వినుకొండలో 144 సెక్షన్ అమలులో ఉండటంతో ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదు. వైసీపీ నేత జగన్ వచ్చి పరామర్శించవచ్చు. కానీ జనసమీకరణకు, ప్రదర్శనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దని ఐజీ పేర్కొన్నారు. ఆయనతో పాటు వినుకొండకు బయలుదేరిన వైసీపీ నాయకుల వాహానాలను తాడేపల్లి, మంగళగిరి, గుంటూరుతో సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ సెక్యూరిటీ నడుమ జగన్ మోహన్ రెడ్డిని మాత్రమే అనుమతించడంతో.. ఆయన మరొక వాహానంలో బయలుదేరారు. దీనిపై గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి స్పందిస్తూ.. వినుకొండలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఎలాంటి ర్యాలీలకు, ప్రదర్శనలకు అనుమతి లేదని తెలిపారు.
ఈ హత్యపై ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎందుకు స్పందించలేదు. రాజకీయ కారణాలతోనే హత్య చేయించారు. డబ్బులు ఇచ్చి టీడీపీ నేతలే రషీద్‌ను చంపించారు. హత్య వెనుక ఎవరున్నారో తేలాల్సిందే. టీడీపీ నేతలే తమ కుమారుడిని దారుణంగా హత్య చేశారని రషీద్ తల్లిదండ్రులు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీలో రషీద్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టే టీడీపీ నేతలు చంపేశారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే. హత్య సమయంలో పోలీసులు ఉన్నా అడ్డుకోలేదు అని రషీద్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పదేపదే రషీద్ హత్య వ్యక్తిగత కారణాలవల్లే జరిగిందని చెప్తున్నారు. ఈ కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని రషీద్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘