రేపు బాలిక కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్..

ys-jagan-22-.jpg

బద్వేల్ పట్టణంలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. రేపు కడప జిల్లాలో పర్యటించనున్న వైఎస్‌ జగన్‌. బద్వేల్ పట్టణంలో హత్యకు గురైన ఇంటర్‌ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పనున్నారు. బద్వేల్ పట్టణంలోని రామాంజనేయనగర్ లో ఉన్న బాధిత బాలిక కుటుంబ సభ్యులను కలిసి వారిని ఓదార్చ నున్నారు. గుంటూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బద్వేల్ చేరుకోనున్న జగన్‌ బాధిత బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన పులివెందులకు చేరుకుని రాత్రికి పులివెందులలో బస చేయనున్నారు.

Share this post

scroll to top