వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో జాతీయ పతాకావిష్కరణ..

ys-jagan-15-.jpg

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, తాడేపల్లిలోని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.  ఉద‌యం 9 గంట‌ల‌కు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారు. ప్రజలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 78వ స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. ఈ రోజు ప్రతి భారతీయుడి హృద‌యం గ‌ర్వంతో నిండే రోజని, బానిస సంకెళ్లను తెంచుకున్న రోజని మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు’ అని పేర్కొన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా తాను నివాళుల‌ర్పిస్తున్నానని జగన్ ట్వీట్ చేశారు.

Share this post

scroll to top