కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా..

ktr-29.jpg

జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా గాయపడిన మాజీ మంత్రి కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయ‌న  ఎక్స్ వేదికగా స్పందించారు. బ్రదర్‌ కేటీఆర్‌ మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని వైయ‌స్‌ జగన్‌ పోస్టు చేశారు. ఇక, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్‌కు వైద్యులు ఆయనకు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వైద్యుల పర్యవేక్షణలో రికవరీ అవుతున్నట్లు పేర్కొన్నారు. త్వరగా కోలుకొని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పలువురు నేతలు, అభిమానులు కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.

Share this post

scroll to top