వివేకా హత్య కేసులో తన తప్పు లేకున్నా ఇబ్బంది పెడుతున్నారని కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి అన్నారు. తన అక్కలు వైఎస్ షర్మిల, సునీతతో పోరాడే శక్తిని ప్రజలే తనకిస్తారని చెప్పారు. ఏదొక రోజు వాస్తవం బయటకొస్తుందని.. అప్పుడు వాళ్లే తనకు క్షమాపణలు చెబుతారని పేర్కొన్నారు. తనను కనుమరుగు చేయాలంటే దేవుడు ఒప్పుకోడని వ్యాఖ్యానించారు.
తప్పు తెలుసుకుని నా అక్కలే క్షమాపణలు చెబుతారు: అవినాశ్
