విశాఖ కార్మికుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష నేటికి 1545 రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో కార్మికుల పక్షాన ఇవాళ నిరాహార దీక్ష చేశామని వైఎస్ షర్మిల తెలిపారు. 2021 జనవరిలో ప్రైవేటీకరణ అంటూ నిర్ణయం తీసుకున్నారని దీంతో అప్పటి నుంచి ఉద్యమం కొనసాగుతూనే ఉందని ఆమె పేర్కొన్నారు. బీజేపీ హయంలోనే స్టీల్ ప్లాంట్‌కి కష్టాలు మొదలు అయ్యాయని విమర్శించారు. అదానీకి మేలు చేసేందుకు స్టీల్ ప్లాంట్‌ను చంపేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు.
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు కాంగ్రెస్ హయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నెలకొల్పబడింది. గత 6 నెలలుగా కార్మికులను తొలగించే ప్రక్రియ సాగుతోంది. కాంగ్రెస్ హయంలో ప్లాంట్ లో 34 వేల మంది ఉద్యోగులు ఉండే వాళ్ళు ఈ 11 ఏళ్లలో కారణం లేకుండా ఉద్యోగులను తొలగించారని ఆమె మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను సైతం తొలగించడంతో ఇప్పుడు ప్లాంట్‌లో 20 వేల ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఈ మధ్య 15 వందల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. ల్ ప్లాంట్ లో తొలగించిన 2 వేల మందిని వెంటనే విధుల్లో తీసుకోవాలని ప్రధాని మోడీనీ, సీఎం చంద్రబాబు ను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆమె డిమాండ్ చేశారు.