కపట హమీలతో అధికారంలోకి వచ్చి రాష్టంలో అమానుషంగా రక్తపాతం సృష్టిస్తున్నారు. అరాచకాల్లో బీహార్ ని మించిపోతున్న ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీలో జంతర్ మంతర్ లో ఈ ఉదయం వైఎస్సార్‌సీపీ ధర్నా కార్యక్రమం జరగనుంది. ఈ నిరసన కార్యక్రమానికి పోలీసుల నుంచి వైఎస్సార్‌సీపీకి అనుమతి లభించింది. వైఎస్ జగన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర కీలక నేతలు అంతా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలనపై నిరసన గళం విప్పుతూ.. మీడియాతో జగన్ మాట్లాడనున్నారు. అలాగే.. ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ ద్వారా ఏపీలో కొనసాగుతున్న నరమేధాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లనున్నారు. వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేసుకుని అధికారి టీడీపీ కూటమి చేస్తున్న దాడులను వైఎస్ జగన్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. అధికారం రాకముందు తమ శ్రేణుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లు.. అధికారం చేపట్టాక దాడులపై మౌనం వహించడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అరాచకాల్లో బీహార్ ని మించిపోతున్న ఏపీ..
