అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వైయస్ఆర్‌సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైయస్ఆర్‌సీపీ 15వ ఆవిర్భావ వేడుకలు బుధవారం ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరైన వైయస్ జగన్ మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించి, పార్టీ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు.
వైయస్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటుంది..
