500 కోట్ల విరాళాలు కూటమి ప్రభుత్వం ఏం చేసింది..

ysr-cp-10.jpg

వరద బాధితులకు మద్దతుగా వైయ‌స్ఆర్‌సీపీ ఉంటుంద‌ని ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. వరద బాధితులకు అన్ని విధాల తోడుగా ఉండడానికి నిరాహార దీక్ష చేస్తున్నామ‌న్నారు. చంద్రబాబు వల్లనే వరదలు వ‌చ్చాయ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. మైలవరం, జగ్గయ్యపేట, విజయవాడ సింగ్‌నగర్, ఇతర ప్రాంతాలు వరదల్లో ప్రజలు ఉన్నార‌ని, వరదల్లో నష్టపోయిన వారికి ఒక్కరికి నష్ట పరిహారం అందించలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. రోజు కలెక్టరేట్ వద్ద వరద బాధితులు పడిగాపులు పడుతున్నారు.  వరద బాధితులకు నష్ట పరిహారం అడుగుతుంటేవైయ‌స్ఆర్‌సీపీపై బుర‌ద జ‌ల్లుతున్నార‌ని మండిప‌డ్డారు.

ఫోటోలకు పోజులు ఇవ్వడం తప్ప కూటమి నేతలు చేసింది ఏమీ లేద‌ని విమ‌ర్శించారు.  రూ. 500 కోట్ల విరాళాలు కూటమి ప్రభుత్వం ఏం చేసింద‌ని ప్ర‌శ్నించారు. అబద్ధపు మాటలు, అబద్ధపు తీరు తప్ప ఏమీ చేయడం లేద‌న్నారు.  కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటమిది.. కూటమి ప్రభుత్వం పడిపోవడానికి ఇదే నాంది అని హెచ్చ‌రించారు. వైయ‌స్ఆర్‌సీపీ కోటి కాదు.. రూ. కోటి 50 లక్షలు ఖర్చు పెట్టింద‌ని మంత్రి లోకేష్‌కు గుర్తు చేశారు. 50వేల కుటుంబాలను సరుకులు పంపిణీ చేశామ‌ని, మా లెక్కలు మేము ఇస్తాం. మీరు ఖర్చు పెట్టిన దానికి లెక్కలు ఇవ్వగలరా? అని నిల‌దీశారు.

Share this post