ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కేసులు దుమారం కొనసాగుతోంది. తమ కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, డైమండ్ బాబు ఎస్పీని కలిశారు. సోషల్ మీడియాలో వైసీపీ నేతలను అసభ్యకరంగా దూషిస్తున్న వారిపై చేసిన ఫిర్యాదుల విషయంలో ఎంత మేరకు చర్యలు తీసుకున్నారో తెలపాలన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను ఐటి యాక్ట్ కింద పెద్ద ఎత్తున అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ వాళ్లు అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టినా అరెస్ట్ చేస్తామని నీతి వాఖ్యాలు చెప్పిన చంద్రబాబు చర్యలు విషయంలో మాత్రం ఎలాంటి పనితనం చూపడం లేదన్నారు.
ఫిర్యాదులపై అన్ని పోలీస్ స్టేషన్స్‌కు వెళ్లి ఏం చర్యలు తీసుకున్నారో ప్రశ్నించామని స్పష్టమైన సమాధానం రాలేదన్నారు. వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరో చెప్పాలన్నారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంన్నారు అంబటి. పోలీసులు స్పందించకుంటే న్యాయ స్థానాల్ని ఆశ్రయిస్తామన్నారు. స్పీకరైనా, మంత్రైనా సామాన్యుడైనా చట్టం దృష్టిలో ఒకటే అని చెప్పారు. జమిలి ఎన్నికలొస్తాయన్న ప్రచారం జరుగుతోందని అధికారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.