కూటమి ప్రభుత్వంపై మార్గాని భరత్‌ ఫైర్‌..

bharath-08.jpg

అడ్డదారిలో అధికారం చేజిక్కించుకున్న కూటమి పార్టీలు మరో ఐదేళ్లు ప్రజలతో పని లేదన్నట్టుగా ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నాయని వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. ఇసుక, లిక్కర్‌ మాఫియాతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం జరుగుతున్నా పట్టించుకోకుండా చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో విజన్‌–2047 అంటూ కోతలు కోస్తున్నారని విరుచుకుపడ్డారు. రాజమహేంద్రవరంలో మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇసుక, లిక్కర్‌ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని తన పార్టీ నాయకులకు దోచిపెడుతూ 2047 నాటికి రాష్ట్రం 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ స్థాయికి చేరుకుంటుందని సీఎం చంద్రబాబు ఢిల్లీలో చెప్పుకోవడం హాస్యాస్పదం అని మాజీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు.

Share this post